![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1109 లో..... మను దగ్గరికి ఏంజిల్ వచ్చి బయటక వెళదామని చెయ్ పట్టుకొని లాగుతుంది. అప్పుడే శైలేంద్ర వచ్చి ఎవరెవరో కాలేజీకి వస్తున్నారు.. అసలు ఇక్కడ ఏం పని అని శైలేంద్ర అడుగుతాడు. నీకు అవసరం లేదు. ఇక్కడ నుండి వెళ్ళిపోమని మను అనగానే.. మా కాలేజీ నుండి నన్నే వెళ్ళమంటావా అని శైలేంద్ర కోప్పడతాడు. తను నా బావ తన కోసం వచ్చానని ఏంజిల్ అనగానే.. మీ బావామరదళ్ళ సరదాలు ఉంటే బయటే చూసుకుండని శైలేంద్ర అంటాడు. మీకు ఇద్దరికి పెళ్లి చేస్తాను. ఈ ఎండీ చైర్ వదిలేయ్ అని శైలేంద్ర అనగానే అవసరం లేదని మను, ఏంజిల్ లు శైలేంద్రని తిడతారు.
మరొకవైపు ఆటో క్లీన్ చేస్తున్న రంగా దగ్గరికి వసుధార వస్తుంది. నాకు బోర్ కొడుతుంది మీ ఊరు చూపిస్తారా అని రంగాని వసుధార అడుగుతుంది. టీవీ చూసుకోవచ్చు కదా అని రంగా అంటాడు. నాకు చూడాలని లేదు మీరు ఊరు చూపించండని వసుధార అంటుంది. అప్పుడే సరోజ వస్తుంది. సరే చూపిస్తానని రంగా అనగానే.. నేను కూడా వస్తానని సరోజ అంటుంది. నేను ఒక్కదాన్నే ప్రశాంతంగా చూడాలనుకుంటున్నానని వసుధార అంటుంది. ఆ తర్వాత సరోజ, వసుధారలు ఇద్దరు అటో ఎక్కుతారు. రంగా ఆటో నడుపుతుంటే.. సైడ్ మిర్రర్ నుండి రంగానే చూస్తుంటుంది వసుధార. అది గమనిస్తున్న సరోజకి కోపం వస్తుంది. అది చూసిన రంగా.. మేడమ్ గారు మీరు ఎటు చూస్తున్నారని అడుగుతాడు. కాసేపటికి బావ.. ఆటో ఆపు అని చెప్పి సరోజ ఆటో కోపంగా దిగి.. మీరే ఊరంతా తిరిగిరండి అని అంటుంది. ఆ తర్వాత రౌడీలు వసుధార ఫోటో పట్టుకొని తిరుగుతూ.. సరోజ దగ్గరికి వచ్చి వసుధార ఫోటో చూపిస్తూ ఈవిడ తెలుసా అని అడుగుతారు. తెలుసని సరోజ అంటుంది. తను ఎందుకు? మీరు ఏమవుతారని సరోజ అడుగగా.. మామని అవుతానని రౌడీ చెప్తాడు. వీళ్ళకి అప్పగిస్తే నా బావకి దూరం గా వెళ్తుందని అనుకుంటుంది సరోజ. తెలుసు చూపిస్తానని వాళ్ళని తీసుకొని వెళ్తుంది సరోజ.
ఆ తర్వాత రంగా, వసుధార వెళ్తుంటే కొబ్బరి బొండాల దగ్గర ఆపి.. కావాలి అంటుంది. డబ్బులు ఉన్నాయా అని రంగా అనగానే.. మీ దగ్గర ఉన్నాయ్ కదా అంటూ వెళ్లి చెరొక కొబ్బరి బొండం తాగుతుంటారు. కొబ్బరి బొండంలో ఉన్న విటమిన్ గురించి వసుధార క్లాస్ తీసుకుంటుంటే.. ఈ కొబ్బరిబొండాల పోషక విలువల గురించి నాకు చెప్పకండి అని రంగా అంటూ.. మీ రిషి సర్ కూడా ఇలాగే అంటారు కదా. మీ ప్రవర్తన చూసిన మీరు చెప్పే విధానం చూసిన ఎవరికైనా చిర్రెత్తుకూ వస్తుంది. ఆ రిషి సర్ ఎవరో కానీ మిమ్మల్ని భరించాడు అంటూ చేతులు ఎత్తి దండం పెట్టాలి.. అదృష్టం ఉంది కాబట్టే అతను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాడని రంగా అనగానే.. వసుధార షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |